ఇటీవలి కాలంలో పలుచోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో మరో ప్రాంతంలో పేకాట శిబిరం గుట్టు రట్టయింది. గచ్చిబౌలిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 12 మంది స్థిరాస్థి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న మర్కారెడ్డి అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. నిందితుడు అంబర్‌పేటకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్న మర్కారెడ్డి.. ఇక్కడ పేకాట కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్ ఎస్వోటీ అధికారులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఇక్కడ 12 మంది వ్యాపారస్థులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.