కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెంజర్లకు చెందిన వీర్లపల్లి కృష్ణ (35) సోమవారం అర్ధరాత్రి నేషనల్ హైవే 44పై కొత్తూరు వైజంక్షన్ సమీపంలో అండర్పాస్ బ్రిడ్జి దగ్గర రోడ్డు దాటుతున్నాడు. అయితే గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టగా దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
వాహనం అతనిపై నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కొత్తూరు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.