కేసముద్రం : మండలంలోని కేసముద్రం విలేజీ గ్రామానికి డోనికెని రాములు (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం విలేజీలోని పశువైద్యశాల సమీపంలో రాములుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా హస్పటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.