వలిగొండ : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోర్క శంకరయ్య (48) అనే వ్యక్తి గ్రామ ఊర చెరువు సమీపంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవానికి పంచనామ నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.