షాద్‌నగర్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎలికట్ట శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల గ్రామానికి చెందిన రవి(32)కి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.