పెద్దేముల్ : తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో టైర్‌పంక్చర్ అయి ఆగిఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఓ బైక్ వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సతీష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందూరు గ్రామ సమీపంలో రక్త మైసమ్మ దగ్గర రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ఆగిఉన్న ట్రాక్టర్ ట్రాలీని తాండూరు వైపు నుంచి తట్టేపల్లి గ్రామానికి వెళుతున్న (ఏపీ09సీఏ8902) అనే నంబర్ గల బైక్ వెనుకభాగం నుంచి బలంగా ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా బైక్‌పై ముగ్గురు యువకులు యూసుఫ్, సోహెల్, సమీర్లు ఉండగా బైక్ నడుపుతున్న యూసుఫ్‌కు తలకు బలమైన గాయం అవ్వగా అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మిగతా ఇద్దరికి రక్త గాయాలు అయ్యాయి. ఈ ముగ్గురిలో యూసుఫ్ జేసీబీ ఆపరేటర్‌గా, సోహెల్ ప్లంబర్‌గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, సమీర్ తాండూరులోని ఓ ప్రయివేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని సమాచారం. ప్రస్తుతం సంఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు.