అత్యాచారం తప్పించుకోవడానికి హత్య.. మహిళను వదిలేసిన పోలీసులు
అత్యాచారం | ఆమె ధీరవనిత.. ఓ రాక్షస మృగంపై వీరోచిత పోరాటం చేసి తన ప్రాణాలను కాపాడుకుంది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన.. ఓ వ్యక్తిని

చెన్నై : ఆమె ధీరవనిత.. ఓ రాక్షస మృగంపై వీరోచిత పోరాటం చేసి తన ప్రాణాలను కాపాడుకుంది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన.. ఓ వ్యక్తిని అడ్డకుని హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని మిన్జూర్ ఏరియాలో గురువారం చోటు చేసుకుంది. 21 ఏండ్ల వయసున్న ఓ మహిళ తన భర్తతో కలిసి పొలం పనులకు వెళ్లింది. భర్త ఆమెకు కొంచెం దూరంలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన ఓ వ్యక్తి.. ఆమె వద్దకు వచ్చి బలవంతంగా లాక్కెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా, కిందకు తోసేసింది. ఆ తర్వాత బండరాయితో తలపై బాదింది. దీంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. అనంతరం అతన్ని రోడ్డుపైకి లాక్కొచ్చిన మహిళ.. తన భర్తకు విషయాన్ని తెలిపింది. స్థానికులంతా అక్కడ గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమెపై ఐపీసీ సెక్షన్ 100 (right of private defence of the body extends to causing death) కింద కేసు నమోదు చేశారు. ఆత్మరక్షణ కోసమే అతనిపై దాడి చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధిత మహిళకు ఎలాంటి శిక్ష విధించకుండా పోలీసులు వదిలేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

