Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (ఏకే 47) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి వారాంతంలోనే సత్తా చాటింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడంతో మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (ఏకే 47) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి వారాంతంలోనే సత్తా చాటింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడంతో మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రముఖ సినీ వసూళ్ల విశ్లేషణ సంస్థ సాక్నిల్క్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ఆదర్శ కుటుంబం’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో భారతదేశంలో రూ.36.85 కోట్ల గ్రాస్, రూ.31.40 కోట్ల నికర వసూళ్లు నమోదయ్యాయి. విదేశాల్లో రూ.14.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఆదివారం ఒక్కరోజే ఏడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఈ సినిమా రూ.8.8 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. తొలి వారాంతంలో వచ్చిన ఈ స్పందనతో చిత్ర బృందం సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. యువీనా పార్థవి, రాజా ప్రజ్వల్, నారా రోహిత్, రఘుబాబు, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిట్టిబాబు (వెంకటేశ్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి) దంపతులకు సంపూర్ణ (యువీనా పార్థవి), స్వర (రాజా ప్రజ్వల్) అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలే తన ప్రపంచంగా బతికే చిట్టిబాబు సాధారణ బ్యాంకు ఉద్యోగి. భార్య చిట్టీల వ్యవహారంతో అప్పులపాలవుతాడు. మరోవైపు కొడుకు చదువుపై శ్రద్ధ చూపకపోవడం, కూతురు ఓ మెకానిక్‌తో ప్రేమలో పడటం అతడికి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. ఇలా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న చిట్టిబాబుకు అనూహ్యంగా రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో అతడి కుటుంబం ఒక్కసారిగా సంపన్నంగా మారి గేటెడ్ కమ్యూనిటీకి మారుతుంది. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలవదు. ఉత్తర భారతానికి చెందిన టార్జన్ అనే దోపిడీ ముఠా ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కుటుంబ సభ్యులను చంపి డబ్బు దోచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రమాదం నుంచి చిట్టిబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? పోలీసు అధికారి దామోదర నాయుడు (నారా రోహిత్) ఏం చేశాడు? గేటెడ్ కమ్యూనిటీలో పరిచయమైన చిత్తరంజన్ (సత్య), మాలతి (నివేదా పేతురాజ్) ఈ వ్యవహారంలో ఎలా కీలకంగా మారారు? చివరికి ఆ కుటుంబానికి ఎదురైన ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

