ఉప్పల్, ఆగస్టు : తక్కువధరకే ప్లాట్‌ను ఇస్తానని చెప్పి, డబ్బులు తీసుకొని, ప్లాట్ చూపించకుండా మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నాచారం సీఐ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం మల్లాపూర్‌కు చెందిన పల్లె కాటమయ్య 2015 సంవత్సరంలో తార్నాక హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే మాదిరాజు లావణ్య(43)80 గజాల స్థలం విక్రయించారు.
తక్కువధరకే ప్లాట్ వస్తుందని రూ.3 లక్షలు ఇచ్చి ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం ప్లాట్‌ను చూయించాలని కాటమయ్య కోరడంతో చూయించలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. లావణ్య గతంలో చూయించిన స్థలం ఆమెది కాదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లావణ్య వద్ద పనిచేస్తున్న అబ్దుల్ మాజిద్ పొత్సహంతోనే ప్లాట్ విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.