Chandigarh | చండీగఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం వేస్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తేజస్విత అనే 25 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన కారు ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విత తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఆమె తల్లి వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఘటనపై తేజస్విత తండ్రి ఓజస్వి కౌశల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఆర్కిటెక్చర్ పూర్తి చేసిందని.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్లు చెప్పారు. తన భార్య, కుమార్తె రోజూ వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటారని తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#chandigarh में हिट एंड रन का मामला। सैक्टर 53 में सड़क किनारे कूतों को खाना खिला रही लड़की को तेज रफ्तार #Thar गाड़ी रौंद कर चली गई। सड़क हादसे की यह घटना पास में लगे सीसीटीवी कैमरे में कैद हो गई। परिवार गाड़ी वाले के खिलाफ़ कारवाई करने की मांग कर रहा। @trafficchd pic.twitter.com/4EneO0Bvyk
— Harpinder Singh (@HarpinderTohra) January 16, 2023