నాగర్‌కర్నూల్ : జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఉదంతం కలకలం రేపింది. ఓ మహిళ పుస్తెల తాడు దొంగలించిన చైన్స్నాచర్లను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన
కోడేరు మండలం తీగలపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తీగలపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే మహిళపై వ్యవసాయ పనులకు వెళ్తున్నది.
ఈ క్రమంలో గ్రామ శివారులోకి వెళ్లగానే ఇద్దరు దుండగలు ఆమె పుస్తెలతాడు తెంపుకొని పారిపోతుండగా..అడ్డుకోబోయిన గొర్రెల కాపరి గంగయ్య, అనంతపురం గ్రామానికి చెందిన యాదగిరిపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.