మెదక్ : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే నరరూప రాక్షసుడయ్యాడు. ముక్కుపచ్చలారని చిన్నారికి నరకం చూపిండు. పొడవాటి తాడుతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. వీపులో కొట్టాడు . చెంపలు చెళ్లుమనిపించాడు. అది కూడా భార్య ఎదుటే కొట్టాడు. చిన్నారిపై ప్రతాపం చూపించి పైశాచిక ఆనందం పొందాడు. ఇదంతా కూతురు అన్నం తినడం లేదని తండ్రి సైకోలా వ్యవహారించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనను స్థానికులు కొందరు సెల్‌ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..మెదక్ మున్సిపాల్టీలో క్యాజువల్ లేబర్‌గా పని చేస్తున్న నాగరాజు తన భార్య వెన్నెలతో కలిసి మెదక్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు సమీపంలో నివసిస్తున్నాడు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కూతురు గగనశ్రీకి (4) తల్లి అన్నం తినిపిస్తుంది. ఈ క్రమంలో తినకుండా చిన్నారి మారాం చేసింది. మద్యం మత్తులో ఉన్న నాగరాజు కూతురు గగనశ్రీ తినకుండా మారాం చేస్తుందని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.
కన్న కూతురు పట్ల కర్కశంగా వ్యవహారించాడు . ఇరుగుపొరుగు వారు నాగరాజు పైశాచిక ఆనందాన్ని సెల్ ఫోన్ లో బంధించి సోమవారం సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
కళ్లేదుటే కూతురును భర్త కొడుతున్న వీడియోలో తల్లి నవ్వుతూ కనిపించడం విస్మయానికి గురి చేస్తుంది. స్థానికులు 100 నెంబర్ సమాచారం అందించడంతో నిన్న రాత్రి పోలీసులు నాగరాజు ఇంటికి వెళ్లారు. నాగరాజు ఆయన భార్యను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లను ఇలా ఎందుకు కొట్టావని ప్రశ్నించారు.
చిన్నారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు . ఇలాంటి తప్పులు మరోసారి చేయొద్దని హెచ్చరించి పంపించామని మెదక్ టౌన్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. అన్నం తినకుండా మారాం చేయడం వల్లనే చిన్నారి గగనశ్రీని కొట్టినట్లు నాగరాజు తమకు చెప్పాడని ఎస్ఐ వివరించారు. కాగా, సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గర్భశోకం మిగిల్చిన రోజే.. కవలలకు జన్మ
CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
మత్స్యరంగానికి ఊపిరి పోసిన సీఎం కేసీఆర్ : మంత్రి తలసాని