
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడతగూడెం వద్ద చోటు చేసుకున్నది. ఇద్దరు సోదరులు బైక్పై వస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను ఉడతగూడెం వాసులు ఏలియా (41), పెద్దులు (36) గుర్తించారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరు సోదరులను మృత్యువు కబళించడంతో గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.