ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత

ముంబై : సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు కోసం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. ముంబైలో దిగిన అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బు తీసుకున్నందుకు, సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు ఇచ్చినందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ) ఇంజినీర్‌ను బీఎంసీ సస్పెండ్ చేసింది. పౌర పరిపాలన ఉద్యోగి దినేష్ గవాండేపై కూడా ఫిర్యాదు అందడంతో అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నకిలీ స్టాంపులు, నగదును స్వాధీనం చేసుకున్నారు, నిందితులు నకిలీ స్టాంపులను ఎలా తయారు చేశారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత డిసెంబర్ 21 నుంచి బ్రిటన్‌లో వెల్లువెత్తిన కొత్త రకం కరోనా వైరస్‌ను నిలువరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం, బీఎసీ కట్టుదిట్టనమైన చర్యలు తీసుకున్నాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరి సంస్థాగత నిర్బంధానికి పంపారు. ఇప్పటివరకు, 49,000 మంది ప్రయాణికులను నిర్బంధించారు. దీన్ని సులభతరం చేయడానికి మూడు షిఫ్టులలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను పనిచేసేలా చూస్తున్నారు. అయితే, ఈ ప్రయాణికులను నిర్బంధించే ప్రక్రియలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని బీఎంసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను సునిశితంగా పర్యవేక్షించాలని విమానాశ్రయ అధికారులకు సూచించింది. దాంతో విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) పరీక్షలపై కన్నేసింది. నిందితుడు బీఎంసీ ఇంజినీర్ గవాండేతో పాటు మరో ఇద్దరు సిబ్బంది విదేశీ ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకొని సంస్థాగత నిర్బంధం లేకుండా చూస్తున్నట్లుగా తేలింది. విదేశీ ప్రయాణికుల నుంచి నగదు స్వీకరిస్తుండగా గవాండేను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని బీఎంసీ స్వయంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సాగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?
భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ పేమెంట్స్: దిగ్గజాల మధ్య పోటీ.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే దిక్సూచి
- 120హెచ్జడ్ డిస్ప్లేతో రెడ్మి నోట్ 10 సిరీస్!