రోడ్డు యాక్సిడెంట్లు చాలా చోట్ల జరుగుతుంటాయి. అందుకే వాహనాలపై వెళ్లేటప్పుడు నిదానంగా వెళ్లాలని చెప్తుంటారు. కానీ కొందరు ఆ మాటలు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్లు బైకులు నడుపుతూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తారు. తాజాగా మహారాష్ట్రలోని పూణే-మోర్గావ్ హైవేపై ఇలాంటి ఘటనే జరిగింది. బారామతి ప్రాంతంలో ఒక వృద్ధుడు రోడ్డు దాటుతుండగా.. చాలా వేగంగా బైక్పై వచ్చేసిన ఒక యువకుడు అతన్ని బలంగా ఢీకొట్టాడు.
అతను ఎంత బలంగా ఢీకొట్టాడంటే.. బైక్ తగలడంతో ఆ వృద్ధుడు 50 అడుగుల దూరం ఎగిరి పడ్డాడు. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఇదంతా ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక ధాబాలోని సీసీకెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. సదరు బైక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
थरकाप उडवणारा व्हिडिओ: रस्ता ओलांडणाऱ्या वृद्धाला दुचाकीस्वाराने हवेत उडवले, वृद्धाचा जागीच मृत्यू pic.twitter.com/w3dRHt4hVC
— Prashant Patil (@Prashu0731) May 18, 2022