న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద జెన్ జెడ్ నిరసనలతో దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో రెబల్ వర్గం పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డీ) పేరుతో కొత్త వర్గం ఏర్పాటైంది. (CJP rebel floats CJP-D) సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు జంతర్‌మంతర్ వద్ద నిరసన సందర్భంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన మనీష్ బ్రహ్మభట్ ఈ రెబల్ వర్గాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఢిల్లీలో ‘సీజేపీ-డీ’ ఏర్పాటు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (సీజేపీ-డీ)ని మేం ప్రారంభిస్తున్నాం’ అని ఆయన ప్రకటించారు. ప్రజల రక్తం, చెమటతో నిర్మితమైన ఉద్యమం నుంచి ఉద్భవించిన అసలు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ బృందం, తదనంతరం కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన బృందంగా మారిపోవడమే సీజేపీ-డీ ఏర్పాటుకు కారణమని వివరించారు.
కాగా, ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై మనీష్ బ్రహ్మభట్ పలు విమర్శలు చేశారు. నిరసనకారులను పక్కనపెట్టి, యువత నేతృత్వంలోని ఈ ఉద్యమాన్ని తమకు నచ్చిన వారితో కూడిన ‘కేజ్రీవాల్ టీమ్’గా సీజేపీని దీప్కే మార్చేశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు అసలు ఉద్యమాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆయన మండిపడ్డారు.
మరోవైపు సీజేపీ జాతీయ స్థాయి నాయకత్వ బృందం కూర్పును మనీష్ బ్రహ్మభట్ ప్రశ్నించారు. జంతర్ మంతర్ ఆందోళనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు, వర్గాలకు ఇందులో ప్రాతినిధ్యం లభించలేదని ఆరోపించారు. ‘రాజకీయ ఒప్పందాలు చేసుకోవడమే వారి లక్ష్యం. విద్యార్థులు లేదా ఇతర రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాడటంలో వారికి ఎలాంటి ఆసక్తి లేదు. దానికి బదులుగా, కేవలం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు నడుస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు మద్దతు ఇచ్చేందుకే వారు బీజేపీని వ్యతిరేకించాలనుకుంటున్నారు’ అని విమర్శించారు. సీజేపీ కేంద్ర బృందానికి ఎంపికైన ఎనిమిది మందికి ఆప్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
కాగా, ఆగస్ట్‌లో అభిజిత్ దీప్కే నివాసంలో నిర్వహించిన సీజేపీ కోర్ టీమ్ సమావేశం గురించి తెలుసుకున్న మనీష్ బ్రహ్మభట్ గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌కు చేరుకున్నారు. జంతర్ మంతర్ నిరసనల్లో చురుకుగా పాల్గొన్న వాలంటీర్లను చర్చలకు దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. తన సహచరుడు రాహుల్ పాండ్యాతో కలిసి నాడు దీప్కే ఇంటి వద్ద నిరసన చేపట్టిన మనీష్, తాజాగా సీజేపీ రెబల్ వర్గమైన (సీజేపీ-డీ)ని ఏర్పాటు చేశారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఆయన టీమ్ ఈ రెబల్ వర్గం ఏర్పాటుపై ఇంకా స్పందించలేదు.
“We will speak against corrupt govt.
Our team will function in democratic manner and not ‘high-command’ system.”
– CJP (D) co-founder Manish Brahmbhatt pic.twitter.com/D4UTK1Uo0Z
— News Arena India (@NewsArenaIndia) September 3, 2026
#WATCH | Delhi: Founder CJP- Democratic, Manish Brahmbhatt says, “Today, we are launching the ‘Cockroach Janata Party Democratic’… Why did we have to do this? The movement belonged to the nation; it succeeded because people poured their blood and sweat into it. However, after… pic.twitter.com/qt0OnWLrzM
— ANI (@ANI) September 3, 2026