Hyderabad | హైదరాబాద్‌లో బెగ్గింగ్ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్క్ వద్ద అడ్డుకుంటున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్‌ను అరెస్టు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవార్‌పై కేసు నమోదు చేశారు. అనిల్ పవార్ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వృద్ధులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.200 ఇచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్‌లోని అల్వాల్ వెంకటాపురంలో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్వోటీ పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యభిచారం చేస్తున్న 9 మంది సహా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు వ్యక్తులను అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 9 మంది యువతులను సఖి కేంద్రానికి తరలించారు.