AP News | ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కపడ జిల్లా వేంపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అలవలపాడులో ఈతకు వెళ్లిగి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య (25) అనే యువకుడితో పాటు సాయి సుశాంత్ (8), సాయి తేజ(11)తో పాటు వారి మేనమామ శశికుమార్ సరదాగా గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. మిగతా ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు.
సాయితేజ, సుశాంత్‌ల అమ్మ మృతి చెందడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. బంధువైన జ్ఞానయ్య సైతం ఈస్టర్ పండుగకు వీరి ఇంటికి వచ్చాడు. ముగ్గురితో కలిసి మేనమామ శశికుమార్‌తో కలిసి అందరూ గాలేరు నగరి కాలువలో ఈతకు వెళ్లారు. నీటిలో దిగగా.. లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. మిగతా ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.