e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News AIIMS Doctor : ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి

AIIMS Doctor : ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యురాలిపై తోటి వైద్యుడు లైంగికదాడి

న్యూఢిల్లీ : (AIIMS Doctor) తన ఆహ్వానం మేరకు బర్త్‌డే పార్టీకి వచ్చిన ఓ సీనియర్‌ డాక్టర్‌పై మరో డాక్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగిపించి లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. అక్టోబర్‌ 10 వ తేదీన ఈ సంఘటన జరగ్గా.. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. హౌజ్‌ ఖాస్‌ పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఎయిమ్స్‌లో సీనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వైద్యురాలు తన సహచరుల్లో కొరి పుట్టినరోజు వేడుకలకు మరో సీనియర్‌ డాక్టర్‌ ఆహ్వానించాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపిన ద్రవాన్ని తాగిపించి అనంతరం ఆమెపై సీనియర్‌ వైద్యుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు మెలకువ రాగా, ‘ఎవరికైనా చెప్తే చంపేస్తానని’ నిందిత వైద్యుడు బాధితురాలిని బెదిరించాడు.

- Advertisement -

చివరకు ఐదు రోజుల తర్వాత ధైర్యం చేసిన ఆమె.. హౌజ్‌ ఖాస్‌ పోలీసులను సంప్రదించి తనపై లైంగికదాడికి పాల్పడిన వైద్యుడిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. కాగా, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. మేజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కేసు నమోదైనట్లు దక్షిణ జిల్లా డీసీపీ బెనిటా మేరీ జాకర్ తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బాలీవుడ్‌ వృద్ధ బేగం ఫరూక్‌ జాఫర్‌ కన్నుమూత

చిన్నారులు అభిమానించే వాల్ట్‌ డిస్నీ ప్రారంభం

ఇది ఫేస్‌బుక్‌ రహస్య బ్లాక్‌లిస్ట్‌.. బహిర్గతం చేసిన ఓ వెబ్‌సైట్‌

దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్‌‌..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement