మరో వ్యక్తితో సహజీవనం… భార్య చేతులు కట్టేసి బిల్డింగ్ పైనుంచి విసిరేసిన భర్త
లక్నో: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య చేతులు కట్టేసిన భర్త, నలుగురితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేశాడు. దీంతో ఆమె మరణించింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది. ఘజియాబాద్‌కు చెందిన 30 ఏళ్ల రితికా సింగ్‌కు ఫిరోజాబాద్‌కు చెందిన ఆకాష్ గౌతమ్‌తో 2014లో వివాహం జరిగింది. రితికా తన బ్లాగ్‌లో ఫ్యాషన్, ట్రావెల్‌పై సలహాలు ఇచ్చేది. అయితే వారిద్దరూ 2018లో విడిపోయారు. దీంతో ఫేస్బుక్లో పరిచయమైన విపుల్ అగర్వాల్‌తో కలిసి రితికా సహజీవనం చేస్తున్నది. ఆగ్రాలోని తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మేవతిలో ఒక అపార్ట్మెంట్లో వారిద్దరూ కలిసి ఉంటున్నారు.
కాగా, రితికా భర్త ఆకాష్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు మహిళలు, ఇద్దరు మగవారితో కలిసి అతడు అక్కడకు వెళ్లాడు. రితికా, విపుల్ అగర్వాల్‌పై దాడి చేశారు. తాళ్లతో వారిద్దరి చేతులు కట్టేశారు. విపుల్‌ను బాత్రూమ్లో బంధించారు. అనంతరం నాలుగో అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి రితికాను కిందకు విసిరేశారు. కింద పడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
మరోవైపు బాత్రూమ్లో బంధించిన విపుల్ అగర్వాల్ కిటికీ నుంచి కేకలు వేసి స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. అనంతరం జరిగిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. రితికా భర్తతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

