కాచిగూడ : రత్నానగర్ నాలా రిటైనింగ్ వాల్ పనుల ప్రారంభోత్సవానికి గురువారం మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతూ పలుచోట్ల ఏర్పాటు చేసిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్లేక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు.
దీనిపై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శుక్రవారం కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్కు అంబర్పేట నియోజకవర్గంలోని టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర భీష్మాదేవ్, మేడి ప్రసాద్, సిద్దూ, చంద్రమోహన్, కొమ్ము శ్రీను, సీనియర్ నాయకులు రవీందర్యాదవ్, డాక్టర్ ఓం ప్రకాశ్యాదవ్లు పిర్యాదు చేశారు.
దీనిపై సమగ్రా విచారణ చేపట్టి దోషులను త్వరలో పట్టుకుంటామని కాచిగూడ సీఐ హామి ఇచ్చినట్లు వారు పేక్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే కాలేరు చేస్తున్న పనులను చూసి ఓర్వలేక రాజకీయ పార్టీల వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా అభివృద్ది పనులకు ఆటంకాలు కల్గిస్తున్నారని వారు ఆరోపించారు.
దైర్యంగా రాజకీయంగా ఎదుర్కొనాలే తప్ప, దొంగచాటుగా ప్లేక్సీలను చింపివేయడం పిరికిపంద చర్య అని వారు హెచ్చరిం చారు. గతంలో కూడ ఇలాంటి సంఘటనలు జరిగాయని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం ఐతే సహించేది లేదని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మహేందర్, లక్ష్మణ్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.