లక్నో: యూపీలో చిన్నారులు, మహిళలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. అలీఘఢ్లో నాలుగేండ్ల దళిత బాలికపై హత్యాచార ఘటన కలకలం రేపింది. గోండా ప్రాంతంలో ఆదివారం ఇంటివద్ద ఆడుకుంటూ అదృశ్యమైన బాలిక అలీఘఢ్లోని ఓ పంట పొలంలో విగతజీవిగా పడిఉండటం కనిపించింది.
బాలికకు సమోసా కొనిస్తానని చెప్పిన పొరుగింటి వ్యక్తి మద్యం మత్తులో బాధితురాలిని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అరెస్ట్ చేస్తారనే భయంతో ఆధారాలు లేకుండా బాలికను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని కుటుంబసభ్యులు, స్ధానికులు నిరసనలకు దిగారు.