గుడిసె ముందు ఒక్కతే ఆడుకుంటోందా చిన్నారి. తనకేం తెలుసు మృత్యువు ట్రక్కు రూపంలో వచ్చి కబళిస్తుందని? ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగు చూసింది. సూరజ్‌పూర్ ప్రాంతంలో నివశించే ఒక కుటుంబానికి చెందిన 15 నెలల పాప ఆన్షిక ఈ ఘటనలో దుర్మరణం పాలైంది.
గుడిసెలో నుంచి ఆడుకోవడానికి బయటకు వచ్చిన ఆ పాప.. రోడ్డుపై ఉండగా అటుగా వచ్చిన ఒక ట్రక్కు ఆమెను తొక్కేసింది. విషయం తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సదరు ట్రక్కు హర్యానాలో రిజిస్టర్ అయినట్లుగా అధికారులు గుర్తించారు.
‘‘ట్రక్కు కింద పడి పాప చనిపోయిన ఘటనపై కేసు నమోదు చేశాం. ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది’’ అని సూరజ్‌పూర్ పోలీసు అధికారులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్ లేదా పబ్లిక్ దారిలో వాహనం నడపడం), సెక్షన్ 304 ఏ (నిర్లక్ష్యంతో మరణానికి కారణమవడం) కింద కేు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.