రంగారెడ్డి : జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. ఏవీఎస్ రెడ్డి కాలనీలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా జరిగిన బర్త్ డే వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిన్న రాత్రి జరిగిన బర్త్ డే వేడుకలకు రాకేశ్ అనే యువకుడు హాజరయ్యాడు. రాకేశ్ సెల్‌ఫోన్‌ను మరో యువకుడు దొంగిలించాడు. తన ఫోన్ ఇవ్వమని అతన్ని అడిగినందుకు నలుగురు యువకులు కలిసి రాకేశ్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.