డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్ యువకుడి మృతి..ఇద్దరికి తీవ్ర గాయాలు
యువకుడి మృతి | బైక్ అదుపు తప్పి యువకుడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ప

సంగారెడ్డి అర్బన్ : బైక్ అదుపు తప్పి యువకుడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాశామైలారం పెన్నేస్ట్ పరిశ్రమలో పని చేస్తున్న దివిటి అనిల్‌కుమార్ (26) నైట్ డ్యూటీ ముగించుకొని ఇదే పరిశ్రమలో పనిచేసే మరో ఇద్దరు స్నేహితులు అభిలాష్, విష్ణువర్ధన్తో కలిసి సంగారెడ్డి వస్తున్నాడు.
వీరి బైక్ ఐటిఐ ముందుకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాష్, విష్ణువర్ధన్‌లకు తీవ్ర గాయాలు కాగా పట్టణంలోని ప్రైవేట్ దావాఖానకు తరలించారు. ఇందులో విష్ణువర్ధన్ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లా అలంపూర్ గ్రామానికి చెందిన మృతుడు అనిల్‌కుమార్ సంగారెడ్డి మండల పరిధిలోని కల్పగూర్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. మృతుడి తల్లి భూదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

