Warangal | తోటి కోడళ్ల మధ్య ఘర్షణ.. చేతి కర్రతో బాదడంతో ఒకరు మృతి
Warangal | నెక్కొండ : తోటి కోడళ్లు గొడవ పడటం సహజమే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. తిట్ల పురాణం అందుకుంటారు. అంతటితో ఆగకుండా సిగ పట్లు కూడా పడుతారు. ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని విడిపిస్తారు. ఆ మాదిరిగానే ఓ ఇద్దరు తోటి కోడళ్లు.. గొడవపడి కర్రలతో బాదుకున్నారు. దీంతో ఒక కోడలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాకలో చోటు చేసుకుంది.

నెక్కొండ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ తోట మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం… పత్తిపాక గ్రామానికి చెందిన తాళ్ల లచ్చమ్మ, తాళ్ల కళమ్మ(70) తోటి కోడళ్లు. తరచూ చిన్న చిన్నవిషయాలకే గొడవ పడేవారు. శనివారం ఇద్దరి మధ్య తిట్ల పంచాయతీ పెరగగా తాళ్ల లచ్చమ్మ తన చేతికర్రతో కళ్లమ్మ తలపై కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో లచ్చమ్మను నెక్కొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణం విడిచింది. మృతురాలి కుమారుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?