హైదరాబాద్ : ఓ గుర్తు తెలియని మహిళ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి వయసు 30 ఏండ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే శనివారం కేబుల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తూ.. ఒక్కసారిగా చెరువులోకి దూకినట్లు స్థానికులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.