Jagtial | జగిత్యాల : షటిల్ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి వారు గమనించి దవాఖానకు తరలించేలోపే ప్రాణాలోదిలాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగింది.
జగిత్యాలకు చెందిన బూస వెంకట రాజ గంగారాం (54) రోజుమాదిరిగానే షటిల్ ఆడేందుకు జగిత్యాల క్లబ్ గ్రౌండ్‌కు వచ్చాడు. ఉదయం వాకింగ్ చేసి తోటి మిత్రులతో షటిల్ ఆడుతుండగా ఒంట్లో నలతగా ఉందని చెబుతూ కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేసి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. రాజ గంగారాంకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.