మణికొండ, సెప్టెంబర్ 6 : ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యా యత్నం చేసినట్టు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో ఫోక్ సింగ ర్ ఈశ్వర్సాయిని పట్టుకోవడంలో పోలీ సుల నిర్లక్ష్యమే ఈ నిర్ణయానికి కారణమని ప్రచారం జరిగింది. ఈశ్వర్‌సాయి, మాధురి రాథోడ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేముల వాడలో గత నెల 16న ఓ గదిలో ఉండగా ఆయన భార్య శరణ్య పట్టుకున్నట్టు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈశ్వర్‌సాయి తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని గత నెల 21న నార్సింగి పోలీసులకు మాధు రి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు సకాలంలో స్పందించడం లేదంటూ రెండు రోజుల తర్వాత ఆమె ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించినట్టుగా తెలిసింది.