రాష్ట్రంలో ఒకవైపు విద్యుత్తు డిమాండ్ బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జెన్కో థర్మల్, హైడల్ ప్లాంట్లు వరుసగా పడకేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో పవర్ జనరేషన్ ప్లాంట్లు మూతబడ్డాయి. మూడు థర్మల్, రెండు హైడల్ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ప్లాంట్లు పవర్‌లెస్‌గా మారుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి యూనిట్ల మూసివేతకు సిద్ధపడుతున్నాయి. బొగ్గు కొరతకు తోడు, నిర్వహణా వైఫల్యాలు దీనికి కారణంగా చెప్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో 3, 4 యూనిట్లతోపాటు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లోని యూనిట్-3 మూతపడ్డాయి. దీంతో 1,870 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదేవిధంగా హైడల్ ప్లాంట్లలో 260 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి బ్రేకులు పడ్డాయి. శ్రీశైలంలోని 8వ పేజీలో
పవర్ లెస్‌గా ప్లాంట్లు
యూనిట్-4 సోమవారం ఆకస్మాత్తుగా పడకేయడంతో 150 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. నాగార్జునసాగర్ ప్లాంట్‌లో నిర్వహణ పనుల వల్ల యూనిట్-3లో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోయింది. నిజాంసాగర్లోని రెండు యూనిట్లల్లో 10 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో ఉత్పత్తి యూనిట్లు వరుసగా విఫలమవుతుండటం జెన్కోకు సవాలుగా మారింది. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొందామన్నా దొరుకడం లేదు.
ఆగిపోయిన యూనిట్ల సామర్థ్యం (మెగావాట్లలో)
వైటీపీఎస్ యూనిట్-3 : 800
వైటీపీఎస్ యూనిట్-4 : 800
భద్రాద్రి యూనిట్-3 : 270
శ్రీశైలం యూనిట్-4 : 150
నాగార్జునసాగర్ యూనిట్-3 : 100