భద్రాచలం, సెప్టెంబర్ 6 : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లుచేసి ఆర్థిక మోసాలకు పాల్పడిన భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. కల్యాణ్‌ను ఆదివారం రాత్రి భద్రాచలం తీసుకొచ్చినట్లు తెలిసింది. సోమవారం పోలీసులు కల్యాణ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
ఈ నెల 28న కేసు నమోదుచేసిన పోలీసులు కల్యాణ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, నకిలీ నియామక పత్రాలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించినట్టు సమాచారం. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారిక ప్రకటన అనంతరం కేసులో వాస్తవ పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.