పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫోన్లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తిని దుండగులు వేట కొవడళ్లతో నరికి చంపారు. ఈ విషాదకర సంఘటన రామగుండం మండలం ఎన్టీపీసీ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఎన్టీపీసీ పట్టణం పరిధి 39 డివిజన్ కాజీపల్లికి చెందిన మేకల లింగయ్య అనే వ్యక్తి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో మేకల లింగయ్య కాజిపల్లి గ్రామ శివారులో సెల్ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నాడు.
ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వెనకాల నుంచి వచ్చి తలపై వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్ఐ జీవన్, ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టారు. భూమి వివాదాలే ఈ హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తున్నది. ఈ హత్యపై పోలీసులు ఒకరిద్దరు హంతకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.