ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 21:32:00

75 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం స్వాధీనం

75 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం స్వాధీనం

నిజామాబాద్ : జ‌ఇల్ల జిల్లాలోని డిచ్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సుద్ద‌ప‌ల్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం 75 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని ప‌ట్టుకున్నారు. నిజామాబాద్ సీపీ కార్తీకేయ ఆదేశానుసారం టాస్క్‌పోర్స్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ నాగేంద‌ర్ త‌న సిబ్బందితో రైడ్ చేశారు. ఓ వాహ‌నంలో అక్ర‌మంగా ర‌వాణా అవుతున్న 150 బ‌స్తాల రేష‌న్ బియ్యాన్ని గుర్తించి ప‌ట్టుకున్నారు. బియ్యాన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు వాహ‌న య‌జ‌మానిని అరెస్టు చేశారు.


logo