లక్నో : ఉత్తరప్రదేశ్ ఇందిరాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని కనవాణి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డంప్‌యార్డులో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న గోశాలకు వ్యాపించాయి. దీంతో 38 ఆవులు మృతి చెందాయి.
ఈ సందర్భంగా శ్రీ కృష్ణ గోశాల ఆపరేటర్ సూరజ్ పండిట్ మాట్లాడుతూ.. గోశాల పక్కనే ఉన్న డంప్ యార్డ్‌లో ఆకస్మాత్తుగా సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలు చెలరేగాయని తెలిపారు. క్షణాల్లోనే గోశాలకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ 150 ఆవులు ఉన్నాయని చెప్పారు. ఇందులో 38 మంది మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీని పోలీసులు ఏర్పాటు చేశారు.