Rangareddy | స్వైపింగ్ లేదు క్యాష్ ఇవ్వండన్నందుకు చంపేశారు.. దృశ్యాలు సీసీటీవీలో రికార్డు
Rangareddy | టైం గాని టైంలో వచ్చి పెట్రోల్ పోయమని అడిగారు.. పోనీలే అని పోశారు. డబ్బులు ఇవ్వకుండా కార్డు ఇచ్చారు. కార్డు స్వైపింగ్ లేదు సార్ క్యాష్ ఇవ్వండి అన్నారు. అంతే... సిబ్బందిపై దాడి చేశారు...
Rangareddy | రంగారెడ్డి : నార్సింగిలో నిన్న రాత్రి ఓ ముగ్గురు యువకులు అరాచకం సృష్టించారు. పెట్రోల్ బంక్( Petrol Bunk ) సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. యువకుల దాడిలో పెట్రోల్ బంక్‌కు చెందిన కార్మికుడు మృతి చెందాడు.
కారులో పెట్రోల్ పోయించుకుని, పేమెంట్ కోసం యువకులు కార్డు ఇచ్చారు. స్వైపింగ్ యంత్రం లేదు.. డబ్బు ఇవ్వాలని సిబ్బంది అడగడంతో.. యువకులు రెచ్చిపోయారు. బంక్‌లో ఉన్న ఇద్దరు కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో సంజయ్ అనే కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. యువకుల దాడిలో సంజయ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఆ ముగ్గురిని జన్వాడకు చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్‌గా పోలీసులు గుర్తించారు.
కొట్టిన వెంటనే కుప్పకూలిన సంజయ్‌ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సంజయ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సంజయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం పనిచేస్తూ జీవనం సాగించే తమ కొడుకు మరణించడంతో సంజయ్ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. సంజయ్ మరణానికి కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలంటూ మృతుడి తరపు బందువులు ఆందోళనకు దిగారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

