మహబూబాబాద్ : సిరోల్ పరిధిలోని కాంపల్లిలో పోలీసులు పెద్ద ఎత్తున నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత నల్లబెల్లం రవాణా జరుగుతున్న సమాచారం మేకు మరిపెడ సీఐ సాగర్ నేతృత్వంలో ఎస్ఐ నరేశ్‌తో పాటు సిబ్బంది మాటేసి లారీని పట్టుకున్నారు. లారీలో ఉన్న 25 టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
సిరోల్ పోలీస్‌స్టేషన్‌లో అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో నల్లంబెల్లం అక్రమ రవాణాపై ఉక్కుపాద మోపుతున్నామన్నారు. నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని, పీడీ యాక్ట్‌ల నమోదుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. సీరోల్ ఎస్ఐ నరేశ్, టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్‌ను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. సమావేశంలో తొర్రూరు డీఎస్పీ రఘు, సీఐలు సాగర్, శ్రీనివాస్, సిరోల్ ఎస్ఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.