బస్సులో 20 తులాల బంగారు ఆభరణాలు చోరీ
బంగారు ఆభరణాలు చోరీ | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తి బ్యాగు నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

వెంగళరావునగర్, సెప్టెంబర్ 5 : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తి బ్యాగు నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నాగనబోయిన సాంబశివరావు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ రాజీవ్ నగర్లో నివాసం ఉంటున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల ఉండడంతో తన 20 తులాల బంగారు ఆభరణాలను గతంలో తన స్వగ్రామంలోని ఇండియన్ బ్యాంకులో తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి విడిపించుకునేందుకు గత నెల 23వ తేదీన పామర్రుకు వెళ్లాడు. బ్యాంకు నుంచి నగలు విడిపించుకుని 24వ తేదీన సాయి శ్రీనివాస ట్రావెల్స్కు చెందిన బస్సులో నగరానికి బయలుదేరాడు.
ఆభరణాలున్న బ్యాగును తన సీటు కింద పెట్టుకుని ప్రయాణించాడు. 25వ తేదీన ఉదయం ఎస్.ఆర్.నగర్ లో బస్సు దిగి బ్యాగు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బ్యాగును తెరిచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు.
దీంతో బాధితుడు తిరిగి పామర్రకు వెళ్లి వెదికాడు. నగల దొరకకపోవడంతో ఆదివారం ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

