హైదరాబాద్ : ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మృతులను కర్ణాటకకు చెందిన మోహిన్(23), ఉబెర్(23)గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని బంధువుల ఇంటికొచ్చిన వీరిద్దరూ ఈ ఉదయం బైక్పై వేగంగా వెళ్తుండగా.. ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.