బాలికపై కొవిడ్ కేంద్రం ఉద్యోగి సహా నలుగురు లైంగికదాడి

బెంగళూరు: కరోనా వైరస్‌తో బాధపడుతున్న తల్లికి సహాయంగా ఉండేందుకు కొవిడ్ కేంద్రానికి వచ్చిన ఓ బాలికను.. అదే కేంద్రంలో పనిచేసే ఉద్యోగి సహా మరో నలుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ నగరం శివారులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు మెక్‌గాన్ హాస్పిటల్లో కాంట్రాక్టు కార్మికుడు. ఇక్కడ 16 ఏండ్ల బాలిక కొవిడ్-19కు గురైన తల్లికి సహాయంగా ఉండేందుకు గత గత 15 రోజులుగా మెక్‌గాన్ దవాఖానకు వస్తున్నది. దాంతో ఆ బాలికకు సదరు నిందితుడు పరిచయం అయ్యాడు. పరిచయం కాస్తా స్నేహంగా మారింది. శనివారం సాయంత్రం ప్రధాన నిందితుడు ఆ బాలికను తనతో కలిసి కారులో విందు కోసం వెళ్దామని కోరి.. విందు తర్వాత దవాఖానలో దింపుతానని హామీ ఇచ్చాడు. దానికి అంగీకరించిన బాలిక.. నిందితుడు మరో తన ముగ్గురు స్నేహితులతో కలిసి శివమొగ్గ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయనూరుకు తీసుకువెళ్ళారు. హైవే సమీపంలో ఏకాంత ప్రదేశంలో కారును ఆపి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆమెను దవాఖాన వద్ద దింపేసి వెళ్లిపోయారు.
జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో.. ఆమె తన బంధువులు, దవాఖాన సిబ్బందికి సమాచారం అందించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన దొడ్డపేటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.