ముంబై : ఆరేండ్ల కిందట దక్షిణ ముంబైలోని మున్సిపల్ స్కూల్లో చదువుతున్న బాలిక (11)పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన స్వీపర్‌కు ప్రత్యేక న్యాయస్ధానం 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఘటన జరిగినప్పటి నుంచి బాలిక తన తల్లి, సోదరిని కోల్పోగా ఆపై తండ్రి సైతం బాధితురాలికి దూరమయ్యాడు. బాలిక బాగోగులను ఆమె అత్త చూస్తుండగా. సోదరుడి బాధ్యతను మరో అత్త తలకెత్తుకుంది.
2015 ఫిబ్రవరి-మార్చిలో నెలరోజుల పాటు స్కూల్లో బాలికపై స్వీపర్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు బెదిరించడంతో బాధితురాలు మౌనం దాల్చింది. బాలిక శరీరంపై గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించిన మీదట స్వీపర్ నిర్వాకాన్ని బాలిక బయటపెట్టింది. నెలరోజులుపైగా నిందితుడు బాలికను లైంగికంగా వేధించాడు.