పుచ్చకాయలోని తెల్లటి భాగం ముక్కలు: రెండున్నర కప్పులు
చక్కెర: పావు కిలో
ఫుడ్ కలర్: కొద్దిగా
(నచ్చిన మూడు రంగులు ఎంచుకోవచ్చు)
ముందుగా పుచ్చకాయ మీద ఉన్న ఆకుపచ్చటి చెక్కును తీసేయాలి. తర్వాత ఉండే తెల్లటి మందపాటి పొరను ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడికించాలి. తర్వాత నీళ్లు ఒంపి పక్కకు పెట్టుకోవాలి. ఒక బాణట్లోకి పంచదార పోసి డబుల్ తీగపాకం వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ పాకాన్ని మూడు విడి విడి గిన్నెల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇలా మనం ఎంచుకున్న ఫుడ్కలర్లను కొద్దిగా నీళ్లుపోసి కలిపి, ఆయా గిన్నెల్లోని పాకంలో వేసి కలియబెట్టాలి.
ఇప్పుడు ఇందాక ఉడికించిన పెట్టుకున్న ముక్కల్ని ఈ మూడు గిన్నెల్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పాకం బాగా అంటేలా తిరగబెట్టి గంట సేపు వదిలేయాలి. ఇప్పుడు వాటిని తీసి ఎండబెట్టుకోవాలి. బాగా ఎండితే పుచ్చకాయతో చేసిన టూటీ ఫ్రూటీ సిద్ధం. ఇక ఐస్క్రీమ్లు, ఫ్రూట్ సలాడ్లు… ఇలా నచ్చిన చోట వీటిని వాడుకోవచ్చు.