క్యాలీ ఫ్లవర్:అరకిలో
క్యారట్ : పావు కిలో
బీన్స్: 200 గ్రాములు
బఠాణీలు: అరకప్పు
వెన్న/ నువ్వుల నూనె: పెద్ద స్పూను
వెల్లుల్లి రెబ్బలు: అయిదారు
మైదా/ గోధుమ పిండి: టేబుల్ స్పూను
పాలు: మోస్తరు గ్లాసు
పచ్చిమిరపకాయలు: నాలుగు
చీజ్: చిన్న ముక్క
ఉప్పు: తగినంత
ముందుగా క్యాలీ ఫ్లవర్, క్యారట్, బీన్స్‌లను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరుక్కోవాలి. వీటితోపాటు బఠాణీలను కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి పాయల్ని కూడా సన్న ముక్కలుగా తరగాలి. కడాయి పొయ్యి మీద ఉంచి ఇష్టాన్ని బట్టి వెన్న లేదా నువ్వుల నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్ని రెబ్బల్ని వేయించాలి.
అందులోనే కాస్త గోధుమ లేదా మైదా పిండిని వేసి వేయించి, అందులో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలుపుతూ సాస్‌లాగా తయారు చేయాలి. తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని, బఠాణీల్ని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు చల్లుకోవాలి. చీజ్‌ను తురిమి ఈ ముక్కలపైన వేసి బాగా కలుపుకొంటే ఫ్యూజన్ మోడల్ వెజ్జీస్ ఇన్ చీజ్ గ్రేవీ సిద్ధమైనట్లే! దీన్ని చపాతీల్లో లేదా బ్రెడ్‌తో తింటే వారెవ్వా అనేలా ఉంటుంది.