థేచా లచ్చా పరాఠా
ముందుగా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యిని చుట్టూ తిప్పినట్టుగా పోసుకోవాలి. కొద్దిగా వాము, తగినంత ఉప్పు కలిపి, పైన నీళ్లు చల్లాలి.
గోధుమ పిండి: పావుకిలో
నెయ్యి లేదా నూనె: టేబుల్ స్పూను
వాము: పావు స్పూను
పల్లీలు: రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు: రెండు
వెల్లుల్లి రెబ్బలు: పది పదిహేను
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
తయారు చేసే విధానం
ముందుగా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యిని చుట్టూ తిప్పినట్టుగా పోసుకోవాలి. కొద్దిగా వాము, తగినంత ఉప్పు కలిపి, పైన నీళ్లు చల్లాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా ముద్దగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేయించుకొని, వెల్లుల్లి పాయల్ని ఒలుచుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బల్ని వేసి రెండు తిప్పులు తిప్పాలి.
ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని గుండ్రంగా ఒత్తుకోవాలి. దాని పైన నూనె రాసి, పొడిపిండిని పూతలా పూయాలి. దీని పైన ఇందాక మిక్సీ పట్టిన పల్లీల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని పరచినట్టుగా రాయాలి. ఇప్పుడు ఒత్తిన రొట్టెను గుండ్రంగా రోల్ లాగా మడుచుకోవాలి. దీన్ని మధ్యకు కోసి పరాఠాలా కాస్త మందంగా ఒత్తుకోవాలి. పెనం మీద కొద్దిగా నెయ్యి లేదా నూనెతో కాలిస్తే థేచా లచ్చా పరాఠా సిద్ధమైపోతుంది.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

