శనగపప్పు: ఒక కప్పు
స్వీట్‌కార్న్: కప్పున్నర
శనగపిండి: ఒక టేబుల్ స్పూన్
మినప్పప్పు: ఒక టేబుల్ స్పూన్
ఆవాలు: ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిరపకాయలు: రెండు (సన్నగా తరిగి)
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: చిన్నకట్ట (తరిగి)
ముందుగా శనగపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి, దాని మీద బాణలి పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె సెగ పట్టిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చీ వేసి చిటపటలాడనివ్వాలి. స్వీట్‌కార్న్ గింజల్లో మూడొంతులు కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేయాలి.
పదార్థం కాస్త మగ్గిన తర్వాత మిగిలిన స్వీట్‌కార్న్ కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. పైనుంచి శనగపిండి చల్లుకొని.. కాసేపు వేగనివ్వాలి. ఆపై తగినంత ఉప్పు వేసి.. బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని పొయ్యి మించి దించేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ స్వీట్‌కార్న్ పటోలి రెడీ!