మినుప పప్పు: ఒక కప్పు, బియ్యం: పావు కప్పు, బెల్లం తురుము: అరకప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, వంటసోడా: చిటికెడు.
మినుప పప్పు, బియ్యం బాగా కడిగి అయిదు గంటలపాటు నానబెట్టాలి. వీటితోపాటు బెల్లం తరుము కూడా మిక్సీలో వేసి.. నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో యాలకుల పొడి, వంటసోడా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక పిండి మిశ్రమంతో చిన్నచిన్న బోండాలు వేసుకుని, దోరగా కాల్చుకుంటే నోరూరించే తీపి బోండాలు సిద్ధం.