సొరకాయ తురుము: ఒక కప్పు,
గోధుమ పిండి: ముప్పావు కప్పు
జొన్న పిండి: ముప్పావు కప్పు
ధనియాల పొడి: పావు స్పూను
జీలకర్ర పొడి: పావు స్పూను
పసుపు: చిటికెడు, పచ్చిమిర్చి: రెండు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు, కారం: అరస్పూను
ఉప్పు: తగినంత, నెయ్యి: నాలుగు టీ స్పూన్లు
ముందుగా సొరకాయను చెక్కుతీసి తురమాలి. ఒక కప్పెడు అయ్యాక దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను సన్నగా తరగాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, జొన్న పిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర-ధనియాల పొడులు వేసి కలపాలి. చివర్లో సొరకాయ తురుము, ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మోస్తరు ఉండల్లా చేసి రొట్టెల్లాగా నొక్కుకోవాలి.
పొయ్యి మీద బాణలి పెట్టి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి ఈ రొట్టెల్ని కాల్చుకోవాలి. పచ్చడి, చిన్న ముక్కలుగా తరిగిన మామిడి పండ్ల కాంబినేషన్లో తింటే సొరకాయ తెప్లా రుచి వహ్వా అనిపిస్తుంది. సొరకాయ తురుము వేస్తాం కాబట్టి పిండిని ఎక్కువసేపు నిల్వ ఉంచితే నీరుగారి పోతుంది. కాబట్టి కలిపిన అయిదు పది నిమిషాల్లోనే రొట్టెలు చేసుకోవాలి.