సేమ్యా: కప్పు
నెయ్యి: ఒక స్పూను
పాలు: నాలుగు కప్పులు
చక్కెర: ఒకటిన్నర కప్పు
కస్టర్డ్ పౌడర్: రెండు టేబుల్ స్పూన్లు
కాజు, బాదం: అరకప్పు
పండ్లముక్కలు: యాపిల్, అరటి పండు,
దానిమ్మ గింజలు- రెండు కప్పులు
ముందుగా బాణలి వేడిచేసి.. కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా వేయించుకోవాలి. గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి సేమ్యాను ఉడికించాలి. కాస్త ఉడికాక చక్కెరను కూడా కలుపుకోవాలి. మరో కప్పు పాలు విడిగా తీసుకుని కస్టర్డ్ పౌడర్‌ను అందులో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సేమ్యాలో పోయాలి. ఒక అయిదు నిమిషాలు ఉంచి కాస్త చిక్కబడ్డాక పొయ్యి మీద నుంచి దింపేయాలి.
కాజు, బాదంపప్పులను ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే దానిమ్మ గింజలు ఒలిచి, మిగతా పండ్లను సన్నని ముక్కలుగా చేసిపెట్టుకోవాలి. ఈ తరిగిన పండ్లు, డ్రైఫ్రూట్స్‌ను చల్లారిన సేమ్యాలో వేసి కలపాలి. దీన్ని ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే తియ్యతియ్యగా, చల్లచల్లగా ఉండే సేమ్యా కస్టర్డ్‌ను ఆరగించేయొచ్చు!