కావలసిన పదార్థాలు
క్వినోవా: అర కప్పు, చిక్కటి పాలు: రెండు కప్పులు, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, తరిగిన బాదం, కాజు, కిస్మిస్: పావు కప్పు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
క్వినోవాను బాగా కడిగి గంటపాటు నానబెట్టాలి. కుక్కర్లో రెండు కప్పుల నీళ్లుపోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పాన్లో నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేయించి పక్కనపెట్టాలి. క్వినోవాను పాన్లో వేసి రెండు నిమిషాలపాటు వేయించి, పాలుపోసి కలుపుతూ దగ్గరపడేవరకు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడుతుంటే చక్కెర, యాలకుల పొడి వేసి.. మరో అయిదు నిమిషాలు ఉడికించి దించేయాలి. పైనుంచి వేయించిన డ్రైఫ్రూట్స్ చిలకరిస్తే.. క్వినోవా ఖీర్ సిద్ధం.