పుచ్చకాయలో తెలుపు ముక్కలు: చిన్న కప్పు
మజ్జిగ: రెండు కప్పులు
బియ్యప్పిండి: అర స్పూను
శనగపిండి: ఒక స్పూను
జీలకర్ర పొడి: అర స్పూను
ధనియాల పొడి: అర స్పూను
పచ్చికొబ్బరి: మిక్సీ పట్టిన ముద్ద ఒక స్పూను
పచ్చిమిరపకాయలు, అల్లం ముద్ద: ఒక స్పూను
పోపుగింజలు: ఒక స్పూను
ఎండు మిరపకాయలు: రెండు
ఇంగువ, పసుపు : చిటికెడు చొప్పున
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
ముందుగా పుచ్చకాయలో ఎరుపు రంగు ముక్కలు తరిగి పక్కన పెట్టేయాలి. పైన తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే ముక్కనే మనం మజ్జిగ పులుసు కోసం వాడతాం. పుచ్చకాయ పై చెక్కు తీసేసి కాస్త మీడియం సైజు ముక్కలుగా తరగాలి. దాన్ని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు పసుపు జోడించి ఉడికించాలి. ఇప్పుడు మజ్జిగలో అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి ముద్ద, జీలకర్ర, ధనియాల పొడి, శనగపిండి, బియ్యప్పిండి, మజ్జిగకు సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇందాక ఉడికించిన ముక్కలను చల్లారబెట్టి మజ్జిగలో వేయాలి. కొత్తిమీరను సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపిన మజ్జిగను పొయ్యి మీద పెట్టాలి. కాస్త మరుగుతుండగా తరిగిన కొత్తిమీరను వేయాలి. రెండు నిమిషాలు ఆగి పొయ్యి ఆపేయాలి. చిన్న మూకుట్లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక పోపుగింజలు వేసి చిటపటలాడనివ్వాలి. అందు లో ఎండు మిరపకాయలను ముక్కలుగా చేసి వేసి చివర్లో కాస్త ఇంగువ, కరివేపాకు వేయాలి. ఇందాక చేసుకున్న మజ్జిగలో ఈ పోపు వేస్తే పుచ్చకాయ మజ్జిగ పులుసు రెడీ!!
– ఎం.బాలరాయుడు పాకశాస్త్ర నిపుణురాలు