ఉప్మారవ్వ: కప్పు
పెసర్లు: రెండు కప్పు
బియ్యం: అరకప్పు
జీలకర్ర: పావు స్పూను
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు: రెండు
పోపు గింజలు: స్పూను
నూనె: టేబుల్ స్పూను
ఉప్పు: తగినంత
పెసర ఉప్మా బైట్స్ కోసం పెసలు, బియ్యం కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరప, అల్లం, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టి అందులో నూనె వేసి కాగాక పోపు గింజలు వేయాలి. అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, ఉప్మాకు తగినంత ఉప్పు వేసి ఉప్మారవ్వ పోసి ఉండలు కట్టకుండా కలపాలి.
ఉడికిన తర్వాత దించేయాలి. ఇది కాస్త జారుడుగా ఉంటే మేలు. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి పెసరపిండి అట్టు పోసి, ఉప్మా దాని మీద పల్చగా రాయాలి. తీసిన తర్వాత రోల్లాగా గుండ్రంగా చుట్టి, రెండు అంగుళాల ముక్కలుగా కోసి మరోసారి పెనం మీద రెండు వైపులా వేయించాలి. చట్నీతో సర్వ్ చేస్తే టిఫిన్ పెసరట్టు కాస్తా స్నాక్ పెసర ఉప్మా అయిపోతుంది!